జనం న్యూస్ జనవరి 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ:- కసింకోట మండలంలో విస్సన్నపేట గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని సర్పంచ్ ఉప్పునూరి మాణిక్యం అప్పారావు ప్రారంభించారు. 70 పశువులకు నట్టల నివారణ మందులు మరియు 28 పశువులకు గర్భ కోస పరీక్షలు నిర్వహించి వాటి చికిత్స నిమిత్తం మినరల్ మిక్సర్ ప్యాకెట్లను సిద్దిరెడ్డి శ్రీను చేతుల మీదుగా అందించినట్లు కసింకోట పశువైద్యాధికారి డాక్టర్ అల్ఫోన్సా జార్జ్ చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కూనిసటి ప్రకాష్ రావు, మండే శ్రీనివాసరావు, పల్లల శ్రీనివాస్, గొల్లవిల్లి లక్ష్మి పాల్గొన్నారు.//