జనం న్యూస్ జనవరి 27 శాయంపేట మండలం:- 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి నివాళి అర్పించకపోవడం సిగ్గుచేటు రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలన ప్రతి చిన్న విషయానికి బిఆర్ఎస్ నాయకులను విమర్శించడం సిగ్గుచేటు అధికారం మీద మాదా అని మండలం కేంద్రంలోని ఉన్న దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చిన బిఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం హనుమకొండ జిల్లా యూత్ అధ్యక్షులు కొమ్ముల శివ. మైలారం గ్రామం మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ జిల్లా నాయకులు అరికెళ్ల ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని ఇప్పటివరకు దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకుల కాలం చెల్లిపోయింది అని కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని చెప్పి మళ్లీ మాట మారుస్తున్నారని మళ్ళీ కాలయాపన చేస్తున్నారని ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఒక్క సీటు కూడా రాదు అని విమర్శించారు రైతు భరోసా రైతు కూలీ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు జారీ ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ బోగస్ అని కేవలం స్థానిక ఎలక్షన్స్ స్టంట్ మాత్రమే అని ఇప్పటివరకు యొక్క పథకం కూడా ప్రజలకు అందడం లేదని మళ్లీ వాయిదాలు వేస్తూ కాలయాపన చేస్తున్నారని ఈ సందర్భంగా వారు మాట్లాడారు కాలయాపన చేయకుండా ప్రజలకు ప్రజాపాలన అందించాలని బీ ఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులరా ఖబడ్ధారని అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు మారేపల్లి మోహన్ బిఆర్ఎస్ పార్టీ మైలారం పత్తిపాక గ్రామ శాఖ అధ్యక్షులు చల్ల శ్రీనివాసరెడ్డి పసుల ప్రవీణ్ మండల నాయకులు మైలారం మాజీ సర్పంచ్ మస్క సదయ్య ఎండి రాజ మహ్మద్ నమిత బాజీ అశోక్ అరకిల వెంకట్ ఎండి రియాజ్ తదితరులు పాల్గొన్నారు....