గత పదేండ్ల పాలనలో ఏ ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వలేని బిఆర్ఎస్
సీఎం చిత్రపటాన్ని చించేసిన బీ ఆర్ఎస్ నాయకులను శిక్షించాలి.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి ఎంఏ.హకీమ్.
జనం న్యూస్. ఆగస్టు 3. సంగారెడ్డి జిల్లా. హత్నూర.
రాజకీయ బిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీ ని విమర్శించే హక్కు సునీత రెడ్డికి లేదని గుర్తుంచుకోవాలని.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి ఎంఏ. హకీం.అన్నారు. ఆదివారం సాయంత్రం మండల కేంద్రమైన హత్నూర గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు కర్రె కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా ఎంఏ. హకీం హాజరై వారు మాట్లాడుతూ గతపదేండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ఏఒక్క కుటుంబానికి రేషన్ కార్డులు ఇవ్వలేని చరిత్ర మీదని గుర్తు చేసుకోవాలని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అదిచూసి సునీత రెడ్డి ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు.అధికారిక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తే ఎమ్మెల్యే సునీత రెడ్డికి ఎందుకు అభ్యంతరం అంటూ ప్రశ్నించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 18 నెలల ప్రజా పాలనలో అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందిస్తుంటే బిఆర్ఎస్ నాయకుల కండ్లు మండిపోతున్నాయని అన్నారు.రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలోఎమ్మెల్యే సునీత రెడ్డి ఊసరవెల్లి రాజకీయాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పై బీ ఆర్ఎస్ నాయకులతో డౌన్ డౌన్ అని నినాదాలు చేయించడం సిగ్గుచేటుఅన్నారు.సీఎం చిత్రపటాన్ని చించివేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఏ ఒక్క గ్రామంలో ఇప్పించావు సునీత రెడ్డి అంటూ ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్లను ప్రతి గ్రామంలో మంజూరు చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి దేనని అన్నారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా మాజీ మహిళా అధ్యక్షురాలు సుజాత మాట్లాడుతూ పదే పదే మీ సీఎం,మీ సీఎం అంటున్నారు కదా ఎమ్మెల్యే సునీత రెడ్డి మీ సీఎం. ఎవరో చెప్పాలని ఆమె ప్రశ్నించారు,కాంగ్రెస్ పార్టీకి ఒక సీఎం ఇతర పార్టీలకు ఒక సీఎం ఉండరని నిరంతరం రాష్ట్ర ప్రజల కోసం పనిచేసె సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే ఉన్నారని ఎమ్మెల్యే సునీత రెడ్డికి గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి రాజకీయ స్వార్థం కోసం బిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే సునీత రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదన్నారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు కర్రే కృష్ణ,ఆత్మ కమిటీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వీరస్వామి గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యం,నల్లోల్ల పెంటయ్య,వల్లిగారి లక్ష్మీనారాయణ,సాదిక్ అలీ.ఫేంటేష్. పొట్లగళ్ల రాములు. సదాశివులు.ఎన్ఎస్ యుఐ నాయకులు.రియాజ్ అలీ. జనేయులు.అబ్దుల్ ఖదీర్. నర్సింలు. వల్లి గారి సాయికుమార్.వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.