జనం న్యూస్,ఆగస్టు04,జూలూరుపాడు:
తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా జూలూరుపాడు నివాసి సీనియర్ జర్నలిస్ట్,మున్నూరు కాపు సంఘ నాయకులు బాపట్ల మురళి నియమితులయ్యారు. శంషాబాద్ లో జరిగిన మున్నూరుకాపు సంఘం రాష్ట్ర సమావేశంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుటం పురుషోత్తమరావు పటేల్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ మున్నూరుకాపు రాష్ట్ర కమిటీలో నాకు అవకాశం కల్పించిన మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కు, రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుటం పురుషోత్తమరావు పటేల్ కు ధన్యవాదములు తెలియజేశారు.