పెద్దమ్మతల్లి దేవాలయాన్ని దర్శించుకున్న హింగే భాస్కర్.
జనం న్యూస్ 2 ఆగస్టు 2025 (ఎల్కతుర్తి మండలం బండి కుమారస్వామి రిపోర్టర్).
ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన పెద్దమ్మతల్లి దేవాలయాన్ని శనివారం రోజు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న రైతు రక్షణ సమితి సంఘం జిల్లా అధ్యక్షులు హింగభాస్కర్. అమ్మవారినీ దర్శించుకున్నాక హింగే భాస్కర్ మాట్లాడుతూ పవిత్రమైనటువంటి శ్రావణమాసంలో పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ అమ్మవారి అనుగ్రహం ప్రజలందరి మీద ఉండాలని, రైతులందరూ సంతోషంగా ఉండే విధంగా అమ్మవారి చల్లని చూపు ఉంటుందని, రైతులకు సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయని పాడి పశువులు అభివృద్ధి సంపూర్ణంగా జరుగుతుందని అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర రైతులందరూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లుతారని అమ్మవారి పైన సంపూర్ణ విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో వేడుకోవాలని, ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు పులింటి సుధాకర్, సంపత్ ,వెంకటస్వామి,శ్రీనివాస్, గోషిక నాగరాజ్,తిరుపతి, రవి పులింటి రాములు, జి కుమార్, పెండ్యాల కొమురయ్య, అనిల్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.