జనం న్యూస్,ఆగస్టు04 అచ్యుతాపురం:అచ్యుతాపురం మండలం
పూడిమడక గ్రామ పంచాయతీ కార్యాలయం సమావేశపు హాలు నందు సర్పంచ్ చేపల సుహాసిని అద్యక్షతన గ్రామ పంచాయతీ ప్రత్యేక సమావేశమును వార్డు సభ్యులతో నిర్వహించారు.పూడిమడకలో ఉన్న ప్రభుత్వ భూములను ఏపీఐఐసీ ద్వారా పారిశ్రామిక వాడ అభివృద్ధి కోసం 166.15 ఎకరాల ప్రభుత్వ భూములను అనకాపల్లి జోన్ వారు ద్వారా భూమిని బదలాయింపు చేయుట కొరకు గ్రామ పంచాయతీ తీర్మాణము కొరినందున సెజ్ లో ఉన్న ఫార్మా పరిశ్రమ వ్యర్థాలు వ్యర్ధ జలాలు పైపులైను ద్వారా కాకుండా కాలువలు ద్వారా ఉప్పుటేరు లోకి విడిచిపెట్టడంతో ఉప్పుటేరు నిర్జీవంగా మారిపోవడంతో ఉప్పు రైతులు మరియు మత్స్యకారులు జీవనాధరం కోల్పోయారని జిల్లా ఉన్నత అధికారులకు అనేక సార్లు పిర్యాదులు చేసినా ఏ విధమైన చర్యలు తీసుకోలేదని,ఏపీఐఐసీకి కేటాయించు ఉప్పుపర భూములు ఎగువ నుండి వచ్చే వరద నీరు సహజ సిద్ద రిజర్వాయిరుగా ఉండుటవలన సముద్రం వరద నీరును తీసుకొనే వరకు స్టోరేజ్ డ్యాంగా ఉండుటవలన వర్షాలు పడే సమయంలో వచ్చే వరదలు వలన పూడిమడక గ్రామం రక్షించబడుచున్నదని ఉప్పుగల్లీల భూములు ఎపిఐఐసికి కేటాయిస్తే పరిశ్రమలు నిర్మాణంలో భాగంగా భూమి ఎత్తు పెరుగుతుందని అందుచేత పూడిమడక గ్రామం వరద ముంపుతో నీటితో మునిగే ప్రమాదం ఉందని అలాగే మత్స్య సంపద ఉత్పత్తి గణనీయంగా తగ్గి మత్యకారులు జీవన భృతి దెబ్బ తీసే అవకాశం ఉందని ఏపీఐఐసీకి భూములు బదలాయించాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతూ ప్రజలు పక్షాన పంచాయతీ పాలకవర్గం పూర్తిగా వ్యతిరేకిస్తూ గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదిహించడమైనదని,సీసీ రోడ్డుల నిర్మాణం మరియు గ్రామ అభివృద్ధి పనులకు ఆటంక పరిచిన వ్యక్తుల పై గ్రామ పంచాయతీ నుండి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలుపుతూ ఈ సమావేశంలో పలు అంశాలను పరిశీలించి ఏకగ్రీవంగా తీర్మానించి ఆమోదించడమైనదని సర్పంచ్ సుహాసిని వెంకటరమణ పంచాయతీ కార్యదర్శి సరస్వతి తెలిపారు. ఈ సమావేశంలో వార్డు సభ్యులు పోనమల్ల కొండబాబు తదితర వార్డు సభ్యులు పాల్గొన్నారు.