జనం న్యూస్,ఆగస్టు04,అచ్యుతాపురం:
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలో జగ్గన్నపేట, ఖాజీపాలెం,పెదపాడు తిమ్మరాజుపేట గ్రామాల్లో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షులు దేశంశెట్టి శంకర రావు అద్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎలమంచిలి నియోజకవర్గం సమన్వయకర్త కరణం ధర్మశ్రీ విచ్చేసి విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని, అదేవిధంగా కొన్ని రోజులుగా తిమ్మరాజుపేట గ్రామంలో అంగన్వాడి ఆయా ఉద్యోగం కోసం నిరాహారదీక్ష చేస్తున్న మంత్రి సునీతకి సంఘీభావం తెలపడం జరిగింది అని వైసీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసిలు,ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు వివిధ అనుబంధ విభాగల అధ్యక్షులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.