. జనం న్యూస్ ఆగష్టు 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మహాత్మ జ్యోతి ఫూలే హాస్టల్లను శాయంపేట సీఐ పి రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేశ్వర్ సందర్శించి హాస్టల్లో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం హాస్టల్ లోని పరిసరాలను పరిశుభ్రతను పరిశీలించారు అనంతరం విద్యార్థులకు సైబర్ క్రైమ్ డ్రగ్స్ పై అవగాహన కలిగిస్తూ వాటి ద్వారా కలిగే అనర్థాలు వివరించారు యువత సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు క్రమశిక్షణ తో విద్యలో రాణిస్తూ విజ్ఞానాన్ని సంపాదించేందుకు కృషి చేయాలని అన్నారు ఆపదలు వచ్చినప్పుడు పోలీస్ వారి నెంబర్ 100 కు డైల్ సైబర్ నేరాల కు 1930 నెంబర్ కు ఫోన్ చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ టీచర్లు బేబి అన్నపూర్ణ చైతన్య శ్రీదేవి ధాన్య కానిస్టేబుల్ సతీష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు….