జనం న్యూస్ ఆగష్టు 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని కొప్పుల గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఐసిడిఎస్ సూపర్వైజర్ సునీత ఆధ్వర్యంలో తల్లి పాల వారోత్సవాలు నిర్వహించారు అనంతరం ఆమె మాట్లాడుతూ తల్లి పాలతోనే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు తల్లి పాలు శిశువుకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అప్పుడే పుట్టిన శిశువు నుండి ఆరు నెలల వరకు తల్లిపాలు తాగించాలి గర్భిణీలకు బాలింతలకు తల్లులకు తెలిపారు తల్లిపాలు శిశువుకు శరీరానికి మెదడుకు మంచి పోషణ ఇస్తుందన్నారు ఏ ఇతర పాలలో ఉండాని పోషక గుణాలు తల్లి పాలలో ఉంటాయి తల్లులకు గర్భిణులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఆశ వర్కర్లు పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు….