నిరుపేదలకు రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
జనం న్యూస్ ఆగస్టు 05 ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు )
వికారాబాద్ జిల్లా పూడూర్ మండల్ గట్టుపల్లి గ్రామంలో లో ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు లబ్ధిదారులకు 40 కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు, పంచాయతీ సెక్రెటరీ అబ్దుల్లా అందచేశారు. తెలంగాణలో పదేళ్లు గా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదల కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్రహం అన్నారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు సామేల్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్లుగా రేషన్ కార్డులు మంజూరు చేయక, రేషన్ కార్డులలో చేరికలకు అవకాశం కల్పించక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడ గానే ప్రజాపాలనలో పేదల రేషన్ కార్డుల కల నెరవేర్చడమే కాకుండా కుటుంబసభ్యుల చేరికలకు అవకాశం కల్పించిందన్నారు. సన్న బియ్యం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు సామేల్, సాదక్, కావలి అనంతమ్మ, కావలి మంజుల మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్రహం, దావిద్, రవి పాల్గొన్నారు.