జనం న్యూస్ ఆగస్టు 5 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
విశాఖపట్నం జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం. చంద్ర శేఖర్ అనకాపల్లి మండలం గవరపాలెం వెటర్నరీ డిస్పెన్సరీ మరియు గ్రామీణ పశువైద్య కేంద్ర, మార్టూరు లో విస్తృత తనిఖీ నిర్వహించారు. అన్ని రికార్డులు, స్టాక్ పుస్తకాలు మరియు డిస్పెన్సరీలో అందించబడిన వైద్య సేవల వివరాలను సమీక్షించారు.సంకరజాతి పశువులకు ప్రస్తుతం జరుగుతున్న థైలేరియాసిస్ టీకా కార్యక్రమం,పశువుల పెంపకందారుల ఆర్థిక స్థితిగతులపై సమగ్ర సమాచారాన్ని సేకరించడానికి నిర్వహిస్తున్న బ్లాంకెట్ సర్వే గురించి,లింగ-విభజిత వీర్యం వాడకం, ప్రయోజనాలు మరియు లభ్యతపై రైతులకు అవగాహన కల్పించాలని మరియు ఎం జి ఎన్ ఆర్ ఇ జి ఎస్ పథకం ద్వారా పశుగ్రాసం ఉత్పత్తిని ప్రోత్సహించాలని డాక్టర్ చంద్ర శేఖర్ అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమం లొ గవరపాలెం పశువైద్య అధికారి డా అనీల్ కుమార్, జే వి ఓ వసంత, నిర్మలా మరియు సిబంది. పాల్గొన్నారు.