జనం న్యూస్ ఆగష్టు 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల అభివృద్ధి పనులపై మంగళవారం హైదరాబాద్ లోని గోల్డెన్ జూబ్లీ ఆడిటోరియం రాజేంద్రనగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు రెండు నియోజకవర్గాల్లో శాఖల వారీగా నియోజకవర్గాల్లో నడుస్తున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి పలు సలహాలు సూచనలు చేయగా రెండు నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్న పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరగాతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.