జనం న్యూస్, ఆగస్టు 5, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
జాతీయస్థాయి వర్క్ షాప్ మరియు శిక్షణకు ఎన్నిక కావడం జరిగింది, వీరు గత మే మాసంలో మర్రి చెన్నారెడ్డి, మానవ హక్కుల భవనం యందు ప్రదర్శించిన ఉత్తమమైన బోధనా పద్ధతుల నుండి వీరి తో పాటు మరో ముగ్గురిని ఢిల్లీ లో నిర్వహించబడబోయే జాతీయస్థాయి నూతన విద్యా విధానము పై వర్క్ షాప్ మరియు శిక్షణ కార్యక్రమం కు ఎన్నిక చేయడం జరిగింది. ఆగస్టు 12 నుండి సెప్టెంబర్ 2 వరకు 21 రోజులపాటు ఢిల్లీ సిసిఆర్టి భవన్ యందు ఈ శిక్షణకు హాజరు కావలసినదిగా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ సెక్రటరీ,మరియు జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఇలా జాతీయస్థాయి వర్క్ షాప్ కు ఎన్నికైన దామరకుంట పాఠశాల ఉపాధ్యాయుడు వై చిన్న బ్రహ్మయ్య,భౌతిక శాస్త్రము ను, స్థానిక మండల విద్యాధికారి ఏ వెంకట రాములు, పాఠశాల ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు అమ్మ ఆదర్శ కమిటీ మరియు ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియపరిచారు.