జనం న్యూస్ 06 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
కొత్తవలస(M) ముసిరాంలో సిమ్మ అప్పారావు సమీప బంధువును నాటుతుపాకీతో మంగళవారం సాయంత్రం కాల్చి చంపిన సంగతి తెలిసిందే. డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐ షణ్ముఖ రావు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం, పోలీస్ యంత్రాంగం సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఎస్.కోట మండలంలో ఆస్తి తగాదాలతో సౌంత బాబాయ్‌నే అన్న కొడుకు నాటుతుపాకీతో కాల్చి పొట్టన పెట్టుకున్నాడు. వరుస ఘటనలతో స్థానికులు ఉలిక్కిపడుతున్నారు.