జనం న్యూస్ ఆగస్టు 06 వికారాబాద్ జిల్లా
వికారాబాద్ జిల్లా పూడూర్ మండల పరిధిలోని గట్టుపల్లిలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షానికి నాళాలు నిండి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. గ్రామంలోని పలు వాకిళ్లలో వర్షం నీరు చేరింది.