జుక్కల్ జులై 6 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేంద్రంలో బుధవారం నాడు తెలంగాణ సిద్ధాంతకర్త, స్వరాష్ట్ర భావజాల వ్యాప్తి కోసం జీవితాన్ని అర్పించిన ఉద్యమ స్ఫూర్తి ప్రదాత.. ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా జుక్కల్ గ్రామపంచాయతీ లో అధికారులు, గ్రామ ప్రజలు ఘన నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమానికి జుక్కల్ గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్, గ్రామపంచాయతీ సిబ్బంది రాజు సార్, మనోజ్ కుమార్, మరియు జుక్కల్ గ్రామ యువకులు బొంపల్లి వార్ విజయ్ కుమార్, బుసవార్ కృష్ణ, అషు ఖాన్, బాబర్ ,ఇస్మాయిల్ ఖురేషి , షాకీర్ పాల్గొనడం జరిగింది