జనం న్యూస్ జనవరి 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వాలీబాల్ జట్టులతో ఆర్మీ కి చెందిన క్రీడాకారుల సైతం ఈ పోటీల్లో పాల్గొన్నారు మూడు రోజులపాటు హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో వైజాగ్ కి చెందిన జట్టు ప్రథమ బహుమతిని పొందింది కూకట్పల్లి కాంగ్రెస్ నాయకుడు శేరి సతీష్ రెడ్డి, ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ హాజరై క్రీడాకారులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ క్రీడలు మానసిక శారీరక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయన్నారు తెలంగాణ ప్రభుత్వం విద్య తర్వాత క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి ఆటల పోటీలు జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు