జనం న్యూస్,ఆగస్టు06,అచ్యుతాపురం:
బాబు షురూటీ మోసం గ్యారంటీ – గ్రామ రచ్చబండ కార్యక్రమంలో భాగంగా 5వ రోజు రాంబిల్లి మండలంలోని రజాల, కుమ్మరాపల్లి కట్టుబోలు గ్రామాల్లో యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నాయకులు,కార్యకర్తలతో కలిసి పరిచయం అవుతూ,గ్రామ కమిటీలను త్వరగా పూర్తి చేయాలని, చంద్రబాబు మోసాలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు తెలియజేయాలని,ప్రతి కార్యకర్తను ధర్మశ్రీ ఆకాంక్షించారు.వైసీపీ బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాంబిల్లి మండలం పార్టీ అధ్యక్షుడు కిషోర్ రాజు, జెడ్పీటీసీ ధూళి నాగరాజు,వైసీపీ సీనియర్ నాయకులు నెట్టం సత్యనారాయణ,గోకివాడ సూర్యనారాయణ మాస్టర్,నియోజకవర్గ ప్రచార విభాగం అధ్యక్షుడు రామకృష్ణ, నియోజకవర్గ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు రేబాక రాము,మండల యువజన విభాగం అధ్యక్షుడు వెంకీ, మోటూరు రాఘవేంద్ర మరియు ఆయా గ్రామాల స్తానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.