జనం న్యూస్ ఆగష్టు 07(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కరించాలని ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో గ్రామ గ్రామాన సిపిఎం పార్టీ సర్వేలు నిర్వహించి వాటి పరిష్కారానికి సిపిఎం పోరుబాట నిర్వహిస్తుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు.బుధవారం స్థానిక సీపీఎం పార్టీ సుందరయ్య భవనంలో చందా చంద్రయ్య అధ్యక్షతన జరిగినటువంటి మండల కమిటీ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు చేస్తాననిది దీని గురించి కేంద్రనికి పంపిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏమీ తేల్చకుండా బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్నారని బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ముస్లింలను చూయించి బీసీ రిజర్వేషన్లను అమలు చేయటం లేదని అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు పార్లమెంట్లో చట్టం చేయాలని.వెనుకబడిన తరగతులకు సామాజిక న్యాయం అమలు జరిగేటట్లు అమలు చేయాలని బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని దీనికి సంపూర్ణ మద్దతు సిపిఎం పార్టీ తెలుపుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు, జిల్లా కమిటీ సభ్యులు సెక్స్ సైదా, బచ్చలకూర స్వరాజ్యం, మండల కార్యదర్శి వర్గ సభ్యులు దేశ రెడ్డి స్టాలిన్ రెడ్డి, వి వెంకన్న, కృష్ణారెడ్డి గోపయ్య నాగయ్య వెంకటాద్రి నరసయ్య వెంకట కోటమ్మ జ్యోతి సతీష్ తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.