జనం న్యూస్,ఆగస్టు06,
జూలూరుపాడు: మండలం పడమటి నర్సాపురం గ్రామం ఆశ్రమ పాఠశాల దగ్గరలో కొత్తగూడెం నుంచి తల్లాడ వైపు లారీ, ఖమ్మం నుంచి కొత్తగూడెం వైపు వెళుతున్న మారుతి ఎకో వ్యాన్ ఢీ కొన్నాయి ఈ ప్రమాదంలో ఎకో వ్యాన్ లో 9 మంది ప్రయాణిస్తున్నారు ఎకో వ్యాన్ లో ప్రయాణిస్తున్న వారిలో ఒకరికి విషమంగా ఉంది మిగిలిన వారికి గాయాలయ్యాయి ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న జూలూరుపాడు పోలీస్ వారు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్ లో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, ప్రమాదం జరిగిన తీరు వివరాలు తెలియాల్సి ఉంది.