జనం న్యూస్ ఆగష్టు 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని కాట్రపల్లి గ్రామంలో సి యస్ ఐ బి జె యం ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమమును ప్రహరీ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రిన్సిపాల్ అనిల్ కుమార్ అధ్యక్షతన లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి శాయంపేట మండలం పోలీస్ స్టేషన్ నుండి హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ పాల్గొని మాట్లాడుతూ డ్రగ్ మహమ్మారిని ఎదిరించాలంటే ఉపాధ్యాయులు తల్లి తండ్రులు చెప్పే మంచి మాటలను ఎప్పుడూ పాటించాలని, అదేవిధంగా ఎప్పుడూ కూడా మత్తు పదార్థాల జోలికి పోకూడదని అది మీ జీవితానికి హాని కలుగజేస్తుంది తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థిని విద్యార్థులతో డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించిన ప్రతిజ్ఞను చేశారు. ఈ కార్యక్రమములో కానిస్టేబుల్స్ చనుమల్ల నవీన్ వనం శివ శంకర వర ప్రసాద్ గొల్లి పల్లి సంతోష్ పాఠశాల ఉపాధ్యాయులు రాజునాయక్, రాజన్న, బిజయ్, సత్యం, ప్రవళిక, శైలజ, మౌన్య, ఉమ, శృతి, జెస్విన్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు….