రిసార్టు స్విమ్మింగ్ పూల్ లో యువకుడు మృతి
జనం న్యూస్,ఆగస్టు07, అచ్యుతాపురం:
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో పర్యాటక ప్రాంతమైన కొండకర్ల గ్రామంలో అధికారిక అనుమతులు లేకుండా రిసార్టులు నడుస్తున్నాయని, జల్సాలు చేయడానికి ఇక్కడ ఉన్న రిసార్టులను అద్దెకు తీసుకుని చిన్న,పెద్ద అనే తేడా లేకుండా జల్సాలు చేస్తున్నారని,రిసార్టులో దొరికితే తప్ప వెలుగులోకి రానివి చాలా జరుగుతున్నాయని, ఈ నెల 5న అనకాపల్లి జిల్లా కశింకోట గ్రామనికి చెందిన సవరాల భాస్కర్ అనే యువకుడు జీవిహెచ్ఎస్ రిసార్టు స్విమ్మింగ్ పూల్ లో మృతి చెందాడని, గతంలో కూడా అక్కడ ఉన్న రిసార్టులలో పలువురు చనిపోవడం జరిగిందని, రిసార్టులలో ఏదైనా ప్రమాదం జరిగి బయటికి వస్తే తప్ప రిసార్టుల జోలికి సంబంధిత శాఖల అధికారులు వెళ్లడం లేదని అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.అధికారిక అనుమతులు లేకుండా నడుస్తున్న రిసార్టుల కారణంగా ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా,పర్యావరణానికి కూడా హాని కలుగుతోందని, చాలా రిసార్టులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని వీటిపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.