జనం న్యూస్,ఆగస్టు07,అచ్యుతాపురం
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం వేదిక ఫంక్షన్ హాల్లో
జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు పాల్గొని గాంధీజీ నాటి నుంచి చేనేత సామాజిక ఆత్మగౌరవానికి చిహ్నంగా నిలుస్తుందని, యువత ఈరంగం వైపు ఆకర్షితులవ్వాలని, చేతివృత్తులకు ప్రపంచంలో మంచి డిమాండ్ ఉందని,ప్రభుత్వ పథకాలను మరింత సద్వినియోగం చేసుకుని చేనేతకు పునర్జీవం ఇవ్వాలని వారు మాట్లాడారు. అనంతరం పలువురు ప్రముఖ చేనేత కళాకారులను సన్మానించారు. చేనేత సంఘ నాయకులు పప్పు రాజారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు పప్పల చలపతిరావు, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ సన్యాసి నాయుడు తదితరులు పాల్గొన్నారు.