జనం న్యూస్ ఆగస్టు 07:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల,
మండలంలోని బట్టాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను, గ్రామపంచాయతీని, పలు అభివృద్ధి పనులను ఆర్మూర్ డి ఎల్ పి ఓ, ఏర్గట్ల మండల ప్రత్యేక అధికారి శివకృష్ణ తని ఖిలు నిర్వహించారు. దీనితోపాటు మండల కేంద్రంలోని మండల ప్రభుత్వ దవాఖానను, కేజీబీవీ పాఠశాలను ఆయన తనకు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. ఎంపి ఓ శివ చరణ్, మండల వైద్యాధికారిని రక్షిత రెడ్డి, కేజీబీవీ ఎస్ఓ సుంకరి సంధ్య,బట్టాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి ఆకుల రవి తదితరులు, అయిన వెంట ఉన్నారు.