జనం న్యూస్ ఆగస్టు 08:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల
కేంద్రములో ప్రెస్ మీట్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి బీసీ డికిలరేషన్ లో భాగముగా ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టి 56 % బీసీ కులవర్గాలు యున్నట్లు తేల్చింది. ఇందులో 42% అయినా బీసీలకు రిజర్వేషన్ విద్య ఉద్యోగాలలో రాజకీయాలలో కల్పించాలని అసెంబ్లీ తీర్మానం చేసి ఆర్డెన్స్ కోసం గవర్నర్ కు పంపడం జరిగింది. అ బిల్లును గవర్నర్ ఆమోదించకుండా పెండిగులో పెట్టడంతో ఢిల్లీ లో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున బీసీ బిల్లు ప్రవేశపెట్టి బీసీ రిజర్వేషన్ 42% ఆమోదించి రాజ్యాంగము లోని 9 వ షెడ్యూల్లలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విన్నపాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని మొన్న బుధవారం చలో ఢిల్లీ పేరిట జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేర టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యములో ధర్నా చేపట్టడం జరిగింది, ఇందులో మన నిజామాబాద్ జిల్లా నుండి బాల్కొండ నియోజకవర్గం నుండి మాతోని పాటు చాలా మంది బీసీ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ వారు కేంద్ర ప్రభుత్వంలోమీరు అధికారములో యున్నారు చెప్పడం బయట మాట్లాడటం కాదు ఏది అనుకున్నారు అది చేసే అధికారం మీకే యుంది బీసీ వర్గాలను మభ్య పెట్టకుండా ఉత్త మాటలు మాట్లాడకుండా మీ వైఖరి తెలపకుండా తప్పించుకునే ప్రయత్నం మానుకోవాలి మిమ్మల్ని బీసీ జాతి క్షమించదు. బీజేపీ పాలిత ప్రాంతమైన ఉత్తర్ ప్రదేశ్ లో అన్ని మతాలకు కులాలకు సమాన వాటా ప్రకారం అవకాశాలు కల్పిస్తున్నట్లే ప్రక్కన యున్న తమిళనాడు రాష్ట్రంలో 69 % రిజర్వేషన్లు అంత ఒక్కటై సాధించుకొని అమలులో యున్నట్లే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా జనాభా తామస వాటా ప్రకారం తెలంగాణ రాష్ట్ర బీసీ లకు న్యాయం జరగాలి, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారములో యుంది కాబట్టి బీసీ 42% బిల్లు చట్టం చెయ్యాలి లేకుండా బీసీ వర్గాలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం. ఎన్నో ఏండ్ల కళ నెరవేరడానికి అన్ని ప్రక్కన పెట్టి రాజకీయ నాయకులు, పార్టీలు కూడా బీసీ రిజర్వేషన్ సాధనలో కలిసి రావాలి అన్నారు. అదే విధముగా BRS ప్రభుత్వం 10 ఏండ్లు అధికారం యున్నప్పుడు బీసీల గురించి ఏమీ మాట్లాడకుండా బీసీ రిజర్వేషన్ 34% యుంటే 22% కు తగ్గించి బీసీ వర్గాలకు అన్యాయం చేసి బీసీలకు పదేళ్లలో విద్య ఉద్యోగ రాజకీయంగా చేసిన నష్టనికి అన్యాయానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఇప్పుడు మభ్యపెట్టే మాటలు మాట్లాడుతూ బీసీ గర్జన పేరిట నాటకాలు ఆడితే బీసీ వర్గాలు బొందపెట్టడం ఖాయం. కవిత ఒక్క ప్రక్క కేటిఆర్ హరీష్ ఒక ప్రక్క తలోదారి మాట్లాడుతూ BRS పార్టీ ద్వంద వైఖరి మానుకొని మీ విధానం పైననే మీకే స్పష్టత లేదాని గత పదేళ్లు మీ అధికారములో బీసీ వర్గాలకు తగ్గించిన రిజర్వేషన్ ప్రకారం విద్య ఉద్యోగాలు రాజకీయంగా చేసిన అన్యాయనికి క్షమాపణ చెప్పి బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడాలని లేకుంటే బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని అన్నారు. అలాగే బిజెపి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి కొన్ని రాష్ట్రాలలో ప్రత్యేకముగా బీసీ రిజర్వేషన్ పెంచుకోవటానికి ఎలాంటి ప్రత్యేక చట్టం యుందో అదే విధముగా మన తెలంగాణ రాష్ట్రానికి బీసీ రిజర్వేషన్ చట్టం తెచ్చి విశ్వనీయత చూపాలని అన్ని రాష్ట్రాలకు ఒక్క రకముగా మనకు ఒక్క రకముగా చూడడం కరెక్ట్ కాదని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఏ పార్టీ అయినా ఏ నాయకులైనా బీసీ వర్గాలకు అన్యాయం చెయ్యాలని చూస్తే బీసీ ద్రోహులుగా పరిగణిస్తాం. అన్ని పార్టీ నాయకులు జెండాలు ఎజెండాలు ప్రక్కన పెట్టి కలిసి వచ్చి భావితరాల బీసీ బిడ్డల కోసం విద్య ఉద్యోగ రాజకీయంగా 42% రిజర్వేషన్ సాధించటానికి కులమతాలకు అతీతంగా ఒక్కటై కేంద్ర ప్రభుత్వ మెడలు వచ్చైన రిజర్వేషన్ సాధించుకుందామని దీనికి ముఖ్యముగా బీసీ కుల వర్గాలు ఐక్యతతో ముందుకు సాగాలన్నారు. బీసీ లకు అన్యాయం చేసే ఏ పార్టీ కైనా ఏ నాయకులకైనా ఓట్ల తో బుద్ధి చెప్పే విధముగా అందరం ఒక్కటవుదామని శివకుమార్ పిలుపు ఇచ్చారు. తమిళనాడు రాష్ట్రంలో జల్లి కట్టు ఆచార ఆటను సుప్రీం కోర్ట్ నిషేధిస్తే అక్కడ అన్ని పార్టీలు నాయకులు సంబండా వర్గాలు ఒక్కటై మళ్లీ సాధించుకున్నట్లు అన్ని ప్రక్కన పెట్టి బీసీల కళ నెరవేర్చుకోవడానికి బీసీలంతా ఒక్కటై మన రాజ్యాంగం కల్పించిన జనాభా తామస ప్రకారం విద్య ఉద్యోగాలలో రాజకీయంగా రిజర్వేషన్ సాధించుకునే వరకు పోరాటం ఆపేది లేదని అన్నారు. సంబండ వర్గాలు ఒక్కటై తెలంగాణ రాష్ట సాధన ఎట్లా సాధించుకున్నామో అదే విధముగా పోరాటం చెయ్యాలి. ఏది ఏమైనా బీసీల భావి తరాల కోసమై రిజర్వేషన్ సాధనకు అందరూ కలిసి రావాలని మద్దతు ఇవ్వాలని శివకుమార్ పిలుపు ఇచ్చారు. ఈ ప్రెస్ మీట్లో రెండ్ల రాజారెడ్డి, గడ్డం జీవన్, కూరాకుల బొర్రన్న, పన్నాల నర్సారెడ్డి, జంగాల గణేష్, కోలిప్యాక రవి, ఇబ్రైంపట్నం చిన్న భూమన్న, రాజారాం సహదేవ్, ఓర్సు రాములు, రొక్కెడ చిన్న సాయన్న, దండేవోయిన సాయన్న, దండేవోయిన సాయికుమార్, అన్నెల మురళి గౌడ్, కల్లెడ పురుషోత్తం, మునిమాణిక్యం అజయ్, జంగాల పెద్దోళ్ల శ్రీనివాస్, కంచరి రవి, సున్నపు గణపతి, పుల్లూరి గణేష్, రాంపూర్ భాస్కర్ , మాదస్తూ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ( 08-08-2025 )