(జనం న్యూస్ చంటి ఆగస్టు 8)
శేరిపల్లి : ఆహారం ఉత్పత్తికి రైతులు పడే కష్టం, శ్రమను ప్రత్యక్షంగా చూసేందుకు శేరిపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గురువారం ఉపాధ్యాయులతో కలిసి పొలంబాట పట్టారు. తరగతి గదిలో పుస్తకాలతో కుస్తీపట్టి ఆ తరగతి గదులకే పరిమితం కావడంతో వ్యవసాయ జీవనం,తమ ప్రాంతంలో పండే పంటలను విద్యార్థులకు వివరించడానికి క్షేత్రస్తాయి ప్రదర్శన నిర్వహించామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట్ రెడ్డి తెలిపారు. వ్యవసాయంపై విద్యార్థి దశ నుంచే అవగాహన ఉండాలన్నారు. విద్యార్థులు పొలంలో స్వయంగా నాట్లు వేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అమల, హర్షిణి మరియు రైతులు పాల్గొన్నారు.