భరత్ సింగ్,భూపాల్ సింగ్,రాజ పురోహిత్,
జనం న్యూస్,ఆగస్ట్ 09,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలోని నీవశి భరత్ సింగ్, తండ్రి భూపాల్ సింగ్, రాజ పురోహిత్ రాజస్థాన్,రాష్ట్రంలోని జోదపూర్,జిల్లా ఖరబెరా గ్రామానికి చెందిన భరత్ సింగ్ భూపాల్ సింగ్,వయసు 25 సంవత్సరలు జీవన ఉపాధికై తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా,నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో గత 8 సంవత్సరాలుగా బాలాజీ స్వీట్ హోమ్ నడిపిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేసిన శ్రీరామ మందిర ఆకృతిని, నిస్సిమా శ్రీ రామ భక్తుడైన భరత్ సింగ్, తన సొంత వ్యవహారం చూసుకుంటూనే కాటన్ ముక్కలతో శ్రీరామ ఆలయ ఆకృతిని భక్తి శ్రద్ధలతో నిర్మించి సమస్త శ్రీరామ భక్తులకి అబ్బురపరిచే దిశగా శ్రీరామ ఆలయాన్ని నిర్మించారు.ఆలయంలో బాల రాముని విగ్రహాన్ని ప్రతిష్టాపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను చిన్ననాటి నుంచి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీరామ కథను తన విరామ సమయంలో వింటూ ఉండేవాడినని అన్నారు.ఒకే మాట,ఒకే బాణం,ఒకే భార్య,కార్య దక్షిత కలిగిన మహనీయుడని,తల్లి తండ్రి మాట జవదాటని తనయుడని అన్నారు. నేటి సమాజంలో జన్మించిన జనులందరూ శ్రీరాముని ఆదర్శప్రాయంగా తీసుకోని శ్రీరామచంద్ర ప్రభు నడి యడిన నడకలోనే నడియాడాలని సమస్త ప్రజానీకానికి విన్నవించారు. సార్వభౌమాధికార చక్రవర్తిగా పేరుగాంచిన శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్యలో నిర్మించనున్న ఆలయ ఆకృతిని నిర్మించాలని తనకు వచ్చిన ఆలోచన మేరకు రాత్రి విరమ సమయంలో రోజుకు ఒక గంట పాటు,పది రోజుల్లో శ్రీరామ ఆలయాన్ని నిర్మించి,ఆలయంలో బాల రాముని చిన్మయ స్వరూపాన్ని ప్రతిష్టించడం జరిగిందని అన్నారు.ఇట్టి శ్రీరాముని ఆలయాన్ని చూసిన స్థానిక ప్రజలందరూ ఆశ్చర్య చకితులై వా వా అంటున్నారు.