జనం న్యూస్ : 9ఆగస్టు శనివారం;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
శ్రీవాణి స్కూల్ సిద్దిపేట భారత్ నగర్ లో శుక్రవారం రోజున 10 వ తరగతి చదివే విద్యార్థినిలు పాఠశాల డైరెక్టర్ సి.హెచ్ సత్యం సార్ కు రాఖి కట్టి స్వీటు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అన్న-చెల్లెళ్ళ బంధాన్ని మరింత బలపరచే ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని, విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులకు రాఖీ పండుగ ప్రాధాన్యతను వివరించి, సోదర భావం, ఐక్యత, పరస్పర సహకారం వంటి విలువలను ఆచరణలో పెట్టాలని సూచించారు.ఈ సందర్భంగా డైరెక్టర్ సి హెచ్ సత్యం మాట్లాడుతూ, “రాఖీ పౌర్ణమి మన సంప్రదాయంలో ఒక పవిత్రమైన బంధానికి ప్రతీక. సోదరులు, సోదరీమణుల మధ్య ప్రేమ, రక్షణ, నమ్మకానికి ఇది గుర్తు. ఈ విలువలను మనం జీవితాంతం పాటించాలి” అని అన్నారు.ఈ సందర్భంగా శ్రీవాణి స్కూల్ తరపున అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.