విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 11 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లా బొండపల్లి పోలీసులకు రాబడిన ఖచ్చితమైన సమాచారంతో గొట్లాం బైపాస్ రోడ్డు జంక్షను వద్ద వాహన తనిఖీలు చేపడుతుండగా ఒడిస్సా నుండి తమిళనాడు రాష్ట్రానికి షిఫ్ట్ కారులో గంజాయిని తరలిస్తున్న ఇద్దరి నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి 48 ప్యాకెట్లలో గల 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, పట్టుబడిన నిందితుడు ఇచ్చిన సమాచారంతో మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, 4గురు నిందితులను రిమాండుకు తరలిస్తున్నట్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆగస్టు 9న నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - బొండపల్లి పోలీసులకు రాబడిన ఖచ్చితమైన
సమాచారంతో ఆగస్టు 9న గొట్లాం బైపాస్ రోడ్డులో వాహన తనిఖీలు చేపట్టి, ఒరిస్సా నుండి తమిళనాడు రాష్ట్రానికి షిఫ్ట్ కారు (ఒడి 02ఎస్ 8111) లో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితుల్లో ఒకరు పరారీకాగా, ఒక నిందితుడిని అదుపులోకి తీసుకొని, అతని వద్ద నుండి 48 ప్యాకెట్లులోగల 100కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారన్నారు.పట్టుబడిన నిందితుడు (ఎ-1) ఒడిస్సా రాష్ట్రం కోరాపుట్ జిల్లా పొట్టంగి తాలూకా పుకలి గ్రామానికి చెందిన మనోరంజన్ మిశ్రా (28 సం.లు) ఇచ్చిన సమాచారంతో మరో ముగ్గురు నిందితులు (ఎ-4) అనకాపల్లి జిల్లా పరవాడ మండలం దలాయిపాలెం గ్రామానికి చెందిన దలాయి రామరాజు (45 సం.లు) (ఎ-5) విశాఖపట్నం సిటీ భీమిలి మండలం తగరపువలస నిమ్మవానిపేట కాలనీకి చెందిన విరుమండి గోపి (49 సం.లు) (ఎ-6) తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లా నర్ధాం గ్రామానికి చెందిన పాండియం మాణిక్యం (36సం.లు) ను అదుపులోకి తీసుకున్నామన్నారు.ఎ-4 దలాయి రామరాజు, ఎ-5 విరుమండి గోపిలు స్నేహితులని, వీరికి కోరాపుట్ జిల్లాకు చెందిన ఎ-3 సుదర్శన్ ఖోరాతో పరిచయం ఉందని, అతని సహాయంతో గంజాయిని కొనుగోలు చేసి, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎ-6 పాండియన్ మాణిక్యంతో కలిసి లారీల్లో గంజాయిని తరలిస్తుంటారన్నారు. వీరు కోరావుట్ జిల్లాకు చెందిన ఎ-1 మనోరంజన్ మిశ్రాతో కారులో గంజాయిని తరలించేందుకు రూ.20వేలు, కారును ఎంగేజ్ చేసినందుకు మరో రూ. 20వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. ఎ-1 మనోరంజన్ మిశ్రాకు గంజాయి అక్రమ రవాణలో
సహాయపడేందుకు ఎ-2 పియూష్ పడాల్ ఒప్పందం కుదుర్చుకున్నారని, అందుకుగాను ఎ-2కు రూ.20వేలు ముడుతుందని విచారణలో వెల్లడయ్యిందన్నారు. ఈ కేసులో పరారైన (ఎ-2) పియూష్ పడాలు, ఒడిస్సాలో గంజాయిని కొనుగోలు, సరఫరా చేసిన ప్రధాన నిందితుడు (ఎ-3) సుదర్శన్ భోరాలను త్వరలో పట్టుకుంటామన్నారు. అరెస్టు చేసిన నలుగురు నిందితులను రిమాండుకు తరలిస్తున్నామని, నిందితుల వద్ద నుండి నాలుగు సెల్ ఫోన్లు, రూ.2,500/- ల నగదు, ఒక కారు, 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.ఈ కేసులో నిందితులను అరెస్టు, గంజాయిని సీజ్ చేయుటలో క్రియాశీలకంగా పని చేసిన గజపతినగరం సిఐ జి.ఎ.వి.రమణ, బొండపల్లి ఎస్ఐ యు.మహేష్, పిఎస్ స్ఐ బి.సాయిరాం పడాల్, కానిస్టేబుళ్ళు టి. అప్పల నాయుడు, బి.రవి కుమార్, కే.అప్పారావులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించి, ప్రశంసా పత్రాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అందజేసారు.