జనం న్యూస్. ఆగస్టు 10. సంగారెడ్డి జిల్లా. హత్నూర.
హత్నూర మండల పరిధిలోని దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999- 2000.సంవత్సరానికి చెందిన బ్యాచ్ విద్యార్థులు ఆదివారంనాడు పూర్వవిద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులు నవాబ్ రెడ్డి,నర్సింలు, విఠల్, శివ నందం.రాములు, శ్రీనివాస్, అటెండర్ అఫ్సల్ లను శాలువాలతో సన్మానించి మెమోంటోతో ఘనంగా సత్కరించారు.గత 25సంవత్సరాల క్రితంవారి పాఠశాలలోని మధురమైన జ్ఞాపకాలను ఈసందర్భంగా గుర్తుచేసుకొని ఉపాధ్యాయులతో ఒక రోజంతా సంతోషంగా గడిపారు.చాలారోజుల తర్వాత అందరు ఒకేచోట కలుసుకొని ఒకరికి ఒకరు వారి యోగక్షేమాలను తెలుసుకొని రోజంతా సరదాగా గడిపారు. అనంతరం తమ గురువులతో పాటు కలసి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో .గౌస్ పాషా. ఆమాద్రిజగదీష్.మాణిక్ శర్మ, అజీజ్.వినయ్. అజిత్. మైపాల్ రామకృష్ణ. నవీన్ మహమ్మద్ ఖాన్. నసీర్ పాషా, యాసిన్ ఖాన్. శ్రీధర్ గౌడ్.యాదగిరి. కృష్ణ గౌడ్. నాగేందర్.రఘు. ప్రవీణ్. శేఖర్.భద్రప్ప. ఆంజనేయులు.శంకర్. బ్రహ్మం. నయీమ్. సత్యనారాయణ.విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.