సీఐ వెంకట్ రెడ్డి,
జనం న్యూస్,ఆగస్ట్ 11,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని ట్రాక్టర్ యజమానులు వ్యవసాయ పనులకై తమ ట్రాక్టర్ కేజవిల్స్ తో తార్ రోడ్స్ పై నడిపితే చర్యలు తప్పవని సీఐ వెంకట్ రెడ్డి,అన్నారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మండల పరిదిలోని ట్రాక్టర్ యజమానులు వ్యవసాయ పనులకై తమ ట్రాక్టర్ కేజవిల్స్ తో తార్ రోడ్లపై నడిపితే రోడ్ దెబ్బ తిని త్వరగా గుంతలుగా మారి వాహన దారులకు వాహనాలు నడపడానికి ఇబ్బంది కరంగా మారి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు.ప్రభుత్వం లక్షల రూపాయల ప్రజాధనంతో వేసిన రోడ్లను కాపాడుకోవడం ప్రజలందరి బాధ్యత అని అన్నారు.ట్రాక్టర్ యజమానులకు పోలీస్ శాఖ వారి ప్రత్యేక హెచ్చరిక,:తమ కేజవిల్ ఎక్కించిన ట్రాక్టర్ రోడ్ పై ప్రయాణం చేయాలంటే కేజీవిల్స్ ను కచ్చితంగా పట్టీలను అమర్చుకోవాలని అన్నారు.ట్రాక్టర్ యజమానులు నిబంధనలను పాటించకుండా నడిపిన కేసు నమోదు చేసి, ట్రాక్టర్ ను సీజ్ చేస్తామని అన్నారు.