జనం న్యూస్. ఆగస్టు 10. సంగారెడ్డి జిల్లా. హత్నూర.
ఆసుపత్రి కంటూ వెళ్లిన వృద్ధ మహిళ అదృశ్యమైన సంఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హత్నూర మండలంలోని తుర్కల ఖానాపూర్ గ్రామానికి చెందిన అందోల్ ఎల్లమ్మ (67) శుక్రవారంనాడు మధ్యాహ్నం అనారోగ్య కారణంగా సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి ఇంట్లో నుండి వెళ్ళింది.సాయంత్రం అయినా ఇటికి తిరిగి రాకపోవటంతో కుటుంబ సభ్యులు ఆమె గురించి సంగారెడ్డి ఆసుపత్రి చుట్టుపక్కల ఆరాతీసిన బంధువుల వద్ద వెతికిన ఫలితం లేకపోయింది. వృద్ధురాలు వంటిపై నల్లటి రంగు చీర. పసుపు పచ్చని రంగు జాకెట్ ధరించి ఉందన్నారు. అదృశ్యమైన వృద్ధురాలి కుటుంబ సభ్యులు హత్నూర పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ ఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు.