జనం న్యూస్ ఆగస్టు 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండలంలోని గోవిందా పురం శివారులో గల ప్రభుత్వ భూమి లో సమ సమాజమే లక్ష్యంగా ఆవిర్భవించి అనేక త్యాగాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర 4వ మహాసభలు ఈనెల 20 నుంచి 22 తేదీ వరకు నాలుగు రోజులు పాటు మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో ఘనంగా జరగనున్నాయని, ఈ మహాసభ ను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి పిలుపునిచ్చారు.
మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో సిపిఐ రాష్ట్ర మహాసభ కడ పత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి మాట్లాడుతూ పేద ప్రజలకు కమ్యూనిస్టు పార్టీ తప్ప మరెవరు న్యాయం చేయలేరని, భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) పుట్టి 100 సంవత్సరాల చరిత్రలో పేద ప్రజలకు అండగా నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమిస్తుందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పేదల సమస్యలు, ముఖ్యంగా ఇండ్లు ఇండ్ల స్థలాలు, సాగు భూములు, రైతులు, వ్యవసాయ కూలీలు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నడుపుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. వందేళ్ల ప్రస్థానంతో ముందుకు సాగుతున్న సిపిఐ ని ప్రజలతో మరింత మమేకం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర మహాసభను కొనసాగుతాయని ఆయన అన్నారు. దేశంలో పాలకులు మతం పేరుతో, కులం పేరుతో ప్రజలను విడదీస్తూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. గడిచిన ఈ మూడేళ్లలో బిజెపి అనుసరిస్తున్న మతోన్మాద, ఫాసిస్టు విధానాలను వెలుగులోకి తీసుకురావడంలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారన్నారు. తద్వారా గత సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని 240 సీట్లకు కట్టడి చేయడంలో విజయం సాధించామని చెప్పారు. అదే విధంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిసి బిల్లుకు బిజెపి పెద్ద అడ్డంకి అని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై బిజెపి వైఖరి అవలంభిస్తున్నదన్నారు. ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని డిమాండ్ చేశారు. బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న బీజేపీకి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు గుణపాఠం చెప్పాలన్నారు. బీసీ రిజర్వేషన్లకు సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, బీసీల రిజర్వేషన్లను అడ్డుకుంటున్న బీజేపీని నిలువరించే వామ పక్షాలను బలోపేతం చేయాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిస్టులను ఆదరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీల రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 19 నుంచి 22 తేదీ వరకు నాలుగు రోజులు పాటు మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలు జరగబోతున్నాయని, రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రజా సమస్యలపై చర్చించేందుకు మహాసభను విజయవంతం చేయాలి ఈ మహాసభల్లో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎన్ ఎ స్టాలిన్, మండల కార్యదర్శి బత్తిని సదానందం, మండల సహాయ కార్యదర్శి అనుకారి అశోక్, నాయకులు ఎండీ అంకుషావలి, వల్లాల రమేష్, బండారి సాంబయ్య, ముండ్రాతి రమేష్, గొట్టుముక్కల రాజు, బోగి రమేష్, తీగలా కల్పనా, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు…..