జనంన్యూస్. 11.నిజామాబాదు. ప్రతినిధి.
నిజామాబాదు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ. పాల్గొనడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు సీఎం సహాయ నిధి ద్వారా 121 మందికి 35,62,000 రూపాల విలువ గల చెక్కులు అందించడం జరిగిందన్నారు.. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, అత్యవసర ఆరోగ్య అవసరాలకు సీఎం సహాయ నిధి పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్ధిక భరోసా లభిస్తుందని అన్నారు. తన నియోజకవర్గంలో ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వైద్యం పొందలేని పరిస్థితిలో ఉంటే, వారికి ఈ పథకం ద్వారా ఆదుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నాట్లు తెలిపారు.ఇప్పటి వరకు అనేకమందికి సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయించామని, అర్హులైన ప్రతిఒక్కరికీ సహాయం అందేలా ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి అప్లై చేసుకున్న ప్రతి లబ్ధిదారుని దరఖాస్తులను సెక్రటరేట్ కి పంపించడం జరుగుతుందని అన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అప్లై చేసుకున్న మొత్తంలో 15%, 20% మాత్రమే చెల్లిస్తుందని లక్షల్లో ఖర్చు ఉంటే 15వేలు, 20వేలు ఇస్తే సామాన్యులకు చికిత్స ఖర్చు ఆర్ధిక భారంగా మారుతుందని అన్నారు..బాధితులు అప్లై చేసుకున్న మొత్తంలో 50% ప్రభుత్వం చెల్లించేల చర్యలు తీసుకోవలని డిమాండ్ చేసారు.కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకానికి మంగళం పాడిందని అన్నారు మహిళకు 2500,తులం బంగారం, ఎలక్ట్రికల్ స్కూటీలు ఎక్కడ అని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు,మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.