స్వేరో కోర్ రాష్ట్ర చీఫ్ బాబు నాయక్
జనం న్యూస్ ఆగస్టు 12 వికారాబాద్ జిల్లా
రాష్ట్రవ్యాప్తంగా సుశిక్తులైన వారియర్స్ స్వేరో కోర్ సైనికులను తయారు చేస్తామని రాష్ట్ర స్వేరో కోర్ చీఫ్ కమాండర్ బాబు నాయక్ పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలో స్వేరో నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర స్వేరో కోర్ చీఫ్ బాబు నాయక్ హాజరై రాష్ట్రంలో స్వేరో సైన్యాన్ని తయారు చేయుటకు స్వేరో కోర్ నిర్మాణం కోసం 33 జిల్లాలు పర్యటించి సమసమాజం కోసం పాటుపడే స్వేరో వారియర్స్ ని తయారు చేసే క్రమంలో వికారాబాద్ జిల్లాకు రావడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో స్వేరోస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్నాపూర్ శ్రీనివాస్ గౌరవ జిల్లా అధ్యక్షులు మీ రాజేష్ స్వేరో, జిల్లా ఉపాధ్యక్షులు నరేందర్, రాజు, ముకుంద్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కమిటీ సభ్యులు సుధాకర్, సాలెటి వెంకర్, శ్రావణ్ సీనియర్ నాయకులు మంచన్ పల్లి శ్రీనివాస్ మరియు సింగం, నర్సిములు, శ్రీనివాస్, నర్సింలు. T. యాదయ్య వెంకటేష్ B. శ్రీనివాస్ JBYI , నర్సింలు, శేఖర్, ప్రసాద్, నవీన్ పలువురు పాల్గొన్నారు.