జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 12 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు చిలకలూరిపేట పట్టణంలో ప్రముఖ సీనియర్ గైనకాలజిస్ట్ మంచిమనిషి నిగర్వి స్నేహశీలురు ప్రజా వైద్య సేవ రత్న బిరుదాంకితులు డాక్టర్muddana రమేష్ బాబు గారు, ఏషియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకున్నందుకు జయ నర్సింగ్ హోమ్ లో కణ సత్కారం నిర్వహించడం జరిగింది, ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ 38 సంవత్సరములకు పైగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ గుంటూరు, పల్నాడు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జిల్లాల లొ గుర్తింపు పొంది, 35 వేలకి పైగా ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించి ఎంతోమంది కన్న తల్లులకు ప్రసవ వైద్య సేవలు అందించి ఇప్పటికీ వైద్య సేవలు అందిస్తూ పట్టణంలోనే తమకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న ముద్దన రమేష్ బాబు గారికి ఏషియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడం చిలకలూరిపేట పట్టణానికి గర్వకారణమని తెలియజేశారు, అనంతరం వేదమంత్రాలతో డాక్టర్ ను ఆశీర్వదించి పలువురు పట్టణ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు, వారు మాట్లాడుతూ చిలకలూరిపేట కే మకుటం లేని మహారాజు డాక్టర్ ముద్దన రమేష్ బాబు అని వైద్య సేవలో వారికి సాటి లేదని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు మేడూరి ఆంజనేయులు, మద్దుల ప్రసాదు, అయినవోలు హనుమంతరావు,మానేపల్లి సుధాకర్, పావులూరి హనుమంతరావు,, జగదీష్ రెడ్డి చండ్ర భాస్కర రావులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు