జనం న్యూస్ ఆగస్టు(12) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం
వ్యాప్తంగా సోమవారం రాత్రి నుండి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షానికి తుంగతుర్తి మండలం కరివిరాల ప్రాథమిక పాఠశాల ఆవరణలోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. తుంగతుర్తి మండలంలో రెవెన్యూ రికార్డుల ప్రకారం 135.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది అని అధికారులు తెలిపారు. ఈ సీజన్లో ఈ వర్షం పెద్దదిగా పేర్కొంటున్నారు. దీంతో అనేక గ్రామాలలో చెరువులు, కుంటలు నిండిపోయి అలుగులు పోస్తున్నాయి. సంగం- కోడూరు ప్రాంతాల మధ్య వాగు పొంగటంతో రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.