జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 12 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ పల్నాడు జిల్లా , క్యాంపు స్వచ్చంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో IEC campaign మరియు యాక్టివిటీస్ ను గణపవరం లోని చుండి రంగనాయకులు డిగ్రీ కళాశాల లొ స్టూడెంట్స్ కు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమముకు ముఖ్య అతిధిగా కళాశాల ప్రిన్సిపాల్ ABB. మనోహర్ పాల్గొన్నారు అయన మాట్లాడుతూ HIV/AIDS అంటే ఏమిటీ అవి ఎన్ని మార్గాలు ద్వారా వస్తుంది అని వివరించడం జరిగింది. అందులో భాగంగా ఏరియా హాస్పిటల్ ఐసీటీసీ కౌన్సిలర్ K. హనుమంత్ రావు మాట్లాడుతూ హెచ్.ఐ.వి/ఎయిడ్స్ గురించి మరియు అవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో కలసి జీవించాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్, క్షయ వ్యాధి సంబందం గూర్చి, సుఖ వ్యాధులు మరియు చికిత్స గూర్చి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఏక్ట్ 2017 ART మందులు, APSACS app ,టోల్ ఫ్రీ నెంబర్ 1097 గూర్చి తెలుపుతూ అవగాహన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో క్యాంపు ప్రాజెక్ట్ మేనేజర్ కొండా. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ క్యాంపు సంస్థ అందించు సేవలు మరియు High risk group లకు సుఖ వ్యాధులు మరియు HIV సంబందించిన సేవలు గురించి ఫోటో ఎక్సభిషన్ మరియు వ్యక్తి గత మరియు గ్రూప్ ద్వారా తెలియచేయుచున్నామని తెలిపినారు .ఈ కార్యక్రమం లొ college ఇంచార్జ్ E. నిరంజన్ క్యాంపు ANM : I ఊహ క్యాంపు స్వచ్చంద సేవా సంస్థ స్టాఫ్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.