జనం న్యూస్ ఆగస్టు 12 ముమ్మిడివరం ప్రతినిధి
అయినవిల్లి మండలం ముక్తేశ్వరం లో బీజేపీ మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ ఆధ్వర్యంలో మంగళవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, జాతీయ కౌన్సిల్ మెంబర్, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా, జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు మరియు హర్ ఘర్ తిరంగా యాత్ర జోనల్ ఇన్చార్జి నల్లా పవన్ కుమార్, నియోజకవర్గ కన్వీనర్ చీకురుమెల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల రెవెన్యూ కార్యాలయం వద్ద నుంచి ముక్తేశ్వరం సెంటర్ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ప్రతీ ఇంటి మీద జాతీయ జెండా ఎగురవేయాలి అనే నినాదంతో ముందుకు సాగారు. ఈ ర్యాలీ లో మండల కార్యాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు, మండల పూర్వపు అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు కుడుపూడి చంద్రశేఖర్, రాష్ట్ర ఓబిసి కార్యవర్గ సభ్యులు కొప్పనాతి శ్రీరామచంద్రమూర్తి, అమలాపురం పట్టణ అధ్యక్షులు అయ్యల భాషా, రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు యనమదల రాజ్యలక్ష్మి, ఓబీసీ జిల్లా నాయకులు మిద్దె రవిరాజ్, జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు సాద్విక్, జిల్లా కార్యదర్శి మోకా ఆదిలక్ష్మి, మహిళా నాయకురాలు కొండేటి జయలక్ష్మి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు వేటుకూరి శ్రీనివాసరాజు, వేటుకూరి సత్తిరాజు, అల్లవరపు రవి శర్మ తదితరులు పాల్గొన్నారు.