అత్యవసర సమయాల్లో 100 కి కాల్ చెయ్యండి
జనం న్యూస్, ఆగష్టు 13, జగిత్యాల జిల్లా,
మెట్ పల్లి: భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మెట్ పల్లి ఎస్సై పబ్బ కిరణ్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ కూలీ పోయే ఇండ్లలో ఎవరు ఉండొద్దు,చెరువులు, వాగుల వద్దకు వెళ్లొద్దు,విద్యుత్ స్తంభాలతో జాగ్రత్త వహించాలి అని అన్నారు. నది పరివాహక ప్రాంతాల్లో కాలువలు చెరువుల ప్రాంతాల్లో పశువులను మేపడానికి ఎవరు వెళ్ళవద్దని సూచించారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కూలీ పోయే ప్రమాదంలో ఉన్న ఇండ్లలో నివసించే ప్రజలు సురక్షిత నివాసాలకు తరలివెళ్లాలని అన్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలలో ఉండే ఇండ్లలోకి వర్షపునీరు చేరకుండా జాగ్రత్త గా ఉండాలి అన్నారు, వర్షానికి రోడ్లు కొట్టుకుపోయి , గుంతలు ఏర్పడి అందులో నీరు నిల్వ ఉండి ఆ గుంతలు వాహనదారులకు కనిపించక ప్రమాదానికి గురి అయ్యి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది కావున జాగ్రత్తగా, నెమ్మదిగా చూసుకొని ప్రయాణించండి.ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, నదులు, రిజ్వర్వాయర్లు, చెరువుల దగ్గరకు వెళ్ళరాదు.భారీ వర్షాల కారణంగా వాహనాల యొక్క బ్రేకులు పడే అవకాశం లేనందున టైర్లు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున పరిమిత వేగంతో వెళ్లగలరు అన్నారు,భారీ వర్షాల కారణంగా అత్యవసరమైతేనే ఇంటి నుండి బయటకు వెళ్ళాలి అన్నారు, ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 నెంబర్ కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని మెట్ పల్లి ఎస్సై పబ్బ కిరణ్ కుమార్ తెలిపారు.