జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా, తేదీ ఆగస్టు 13, (రిపోర్టర్ ప్రభాకర్):
పార్వతీపురం. ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం అధ్యక్షులు నియమితులైన జనసేన పార్టీ నాయకులు ఆగూరుమణి, ఏఎంసి డైరెక్టర్లుచిట్లు హిమబిందు, పెదిరెడ్ల హిమబిందు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు కృతజ్ఞతలు తెలియజేశారు. బుధవారం ఉదయం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి పూలమాలతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు. పిఎసిఎస్ చైర్మన్, డైరెక్టర్లు గా ఎంపికైన వీర మహిళలుకు ఎమ్మెల్యే విజయ్ చంద్ర శుభాకాంక్షలు తెలియజేశారు. రైతులకు మంచి సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.