జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 13 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
అనారోగ్య సమస్యలతో పేదల జీవితాలు ముగిసిపోకూడదన్న సదుద్దేశంతోనే ముఖ్యమంత్రి సీఎం.ఆర్.ఎఫ్ సాయం అందిస్తున్నారు : ప్రత్తిపాటి.
జగన్ చిరుసాయం నిలిపేసి పేదల జీవితాల్లో చీకట్లు నింపాడు : ప్రత్తిపాటి
లబ్ధిదారులకు రూ.28.13లక్షల విలువైన చెక్కులు, ఎల్ఓసీలు పంపిణీచేసిన ప్రత్తిపాటి.
అనారోగ్యసమస్యలతో పేదల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోకూడదన్న సదుద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే సంజీవని వంటి సీ.ఎమ్.ఆర్.ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) పంపిణీని పునరుద్ధరించారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
బుధవారం ఆయన తననివాసంలో పట్టణానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం.ఆర్.ఎఫ్ చెక్కులు అందించారు. మొత్తం 31 మంది లబ్ధిదారులకు.. వారి కుటుంబసభ్యులకు రూ.28,13,197ల విలువైన చెక్కులు, ఎల్ఓసీలు పంపిణీ చేసిన అనంతరం ప్రత్తిపాటి మాట్లాడారు. జగన్ కఠిన హృదయంతో పేదల జీవితాల్లో చీకట్లు నింపాడు చిరు సాయమైనా పెద్ద లబ్ధి కలిగిస్తుందనే మాట సీఎం.ఆర్.ఎఫ్ పంపిణీతో రుజువైందన్న ప్రత్తిపాటి.. ఎంతటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారైనా తమ వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వ సాయం పొందవచ్చన్నారు. పేదలు తమ వ్యాధులకు సంబంధించిన వివరాలతో దరఖాస్తు చేసిన వెంటనే ప్రభుత్వం వేగంగా ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణీ చేస్తోందని ప్రత్తిపాటిచెప్పారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ చిరు సాయాన్ని కూడా నిలిపివేసి, లక్షలాది పేద, మధ్యతరగతి కుటుంబాల్లో తీరని శోకం నింపాడని ప్రత్తిపాటి తెలిపారు. మానవత్వం ఉన్న ఎవరైనా పేదల్ని ఆదుకోవడానికి ముందుకు వస్తారని, అలాంటిది గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కఠినంగా వ్యవహరించి పేదల జీవితాల్లో చీకట్లు నింపాడని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పట్టణ నాయకులు,మండల నాయకలు ఉన్నారు.