కురి మెల్ల శంకర్
జనం న్యూస్ 13 ఆగస్టు ( కొత్తగూడెం నియోజకవర్గం )
ఈరోజు రామాంజనేయ కాలనీ పంచాయతీల నివాసం ఉంటున్న మాదాసు పరుశురాం 63 సంవత్సరాలు రాత్రి 10 గంటల ప్రాంతంలో కరీంనగర్ ఏరియాలో అకస్మాత్తుగా గుండె పోటుతో మరణించడం జరిగింది కొత్తగూడెం నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు కురిమెల్ల శంకర్ నివాళులర్పిస్తూ వారు నాయి బ్రాహ్మణ సేవా సంఘం లో కీలకమైన వ్యక్తిగా సేవలు అందించిన మంచి వ్యక్తి అని జరిగిన మరణ వార్తను నేను జీర్ణించుకోలేకపోయానని అతని యొక్క వ్యక్తిత్వాన్ని కొనియాడారు కొత్తగూడెం నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు తమ సెలూన్ షాపులు పూర్తిగా బంధు పాటించి అంతిమ దహన సంస్కారంలో పాల్గొని నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు తూముల శ్రీనివాస్ సీనియర్ నాయకులు కురుమళ్ళ దుర్గయ్య జిల్లా అధ్యక్షులు కడియాల సత్యనారాయణ జిల్లా గౌరవ అధ్యక్షులు మల్లెల నరసింహారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తూముల సదానందం, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కురిమెళ్ళ వెంకన్న మాదాసు, సత్యనారాయణ, ఉరిమెళ్ళ రాజు రవికుమార్ కంది వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు