జనం న్యూస్ : 13 ఆగస్టు బుధవారం; సిద్దిపేట నియోజికవర్గం ఇంచార్జ్ వై. రమేష్
;ఆగస్టు 17 ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు ప్రెస్ క్లబ్, సిద్దిపేటలో ఆవిష్కరణ జరుగుతుందని బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనమండలి సభ్యులు, కవి, రచయిత దేశపతి శ్రీనివాస్, అతిథులుగా బండకాడి అంజయ్య గౌడ్, కంది శంకరయ్య, ఎన్నవెల్లి రాజమౌళి, సింగీతం నరసింహారావు, మంచినీళ్ల సరస్వతి రామశర్మ, వరుకోలు లక్ష్మయ్య, సముద్రాల శ్రీనివాస్, రాజిరెడ్డి మహేందర్ రెడ్డి, దుర్గం శ్రీనివాస్, నల్ల వెంకటేశం, ఎడ్ల జనార్దన్ రెడ్డి హాజరు అవుతారని సభాధ్యక్షులుగా అంకిల్ల వెంకటేశ్వర్ రెడ్డి, పుస్తక సమీక్షకులుగా వరుకోలు లక్ష్మయ్య, వ్యాఖ్యాతగా గుండ్ల రాజు, సభా సమన్వయం బస్వరాజ్ కుమార్, బైరి రమేశ్ యాదవ్ లు వ్యవహరిస్తారని తెలిపారు. జిల్లాలోని కవులు, రచయితలు , సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో హాజరుకావాలంటూ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు మహాత్మ గాంధీ పార్క్ లో రచయిత నల్ల అశోక్, వరుకోలు లక్ష్మయ్య, గుండ్ల రాజు, డాక్టర్ సుధాకర్, బస్వ రాజ్ కుమార్, కాల్వ రాజయ్య లు ఆవిష్కరించారు.