
డోంగ్లి ఆగస్టు 13 జనం న్యూస్
అధ్యక్షునిగా డి. మారుతి రావ్(ఆంధ్రప్రభ రిపోటర్) ఏకగ్రీవంగా ఎన్నిక డోంగ్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీని బుధవారం మండల రిపోటర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా డి. మారోతి, ఉపాధ్యక్షులు బషీర్, జనరల్ సెక్రటరీగా మనోహర్, సెక్రటరీగా బస్వారాజ్, ట్రెజరీగా లక్ష్మణ్, అడ్వైజర్ కిరణ్, సభ్యులుగా నామేవార్ చంద్రకాంత్, జె. మాధవ్, డి. రాజు ను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు మారుతి రావ్ మాట్లాడుతూ,అన్ని విధాలుగా అందరినీ కలుపుకొని నడుస్తున్నాని అన్నారు. తనను అధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నూతన కమిటీని పలువురు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.