జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా:- అన్నమయ్య జిల్లా బిజెపి అధ్యక్షుడు సాయి లోకేష్ ఈరోజు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ శ్రీ లంక దినకర్ ని సచివాలయంలోని ఆయన చాంబర్లో కలవడం జరిగినది ఇటీవల లంక దినకర్ అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ కు సమీక్షా సమావేశం కు విచ్చేసిన సందర్భంగా ఆయన దృష్టికి పలువురు ప్రజలు మరియు ఎన్ డి ఏ నాయకులు వివిధ రకాల సమస్యలను ఆయన దృష్టికి తేవడం అయినది వాటి పరిష్కార నిమిత్తం ఈరోజు చైర్మన్ దృష్టి సారించినారు ఇటీవల తంబళ్లపల్లెలో మరియు వివిధ ప్రాంతాల్లో వచ్చినటువంటి కరువు దృష్ట్యా కేంద్ర బృందం పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకోవడం జరిగింది . ఆ విషయమై చైర్మన్ కేంద్ర వ్యవసాయ శాఖ మాత్యులు శివరాజ్ సింగ్ చౌహన్ దృష్టికి అన్నమయ్య జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను లేఖ ద్వారా తెలియజేసి వాటిని పరిష్కరించవలెనని విన్నవించారు.అన్నమయ్య జిల్లాలోని వివిధ దేవాలయాల్లోజరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయవలెనని రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి ని కలిసి విన్నవించడం జరిగింది. దేవదాయ శాఖ మాత్యులు వెంటనే స్పందించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయడమైనది. ఇదేను కాక ఇంకా అన్నమయ్య జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కలెక్టర్ కార్యాలయం వద్ద స్థానిక ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు ఇచ్చినటువంటి అనేక అర్జీలను పరిశీలించి త్వరితగతిన వాటి పరిష్కారం కోసం గౌరవ జిల్లా కలెక్టర్ కి మరియు వివిధ శాఖల సంభందిత అధికారులకు పరిష్కారం కోసం లేఖ ద్వారా పంపించడం జరిగినది. ఈ కార్యక్రమాలలో బిజెపి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ పాల్గొన్నారు , సమస్యల పట్ల వెంటనేస్పందించి మంత్రుల దృష్టికి ఇటుఅధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తున్నటువంటి రాష్ట్ర ఇరవై సూత్రాల కార్యక్రమల అమలు చైర్మన్ లంక దినకర్ కి ఎన్డీఏ కూటమి తరఫున అన్నమయ్య జిల్లా ప్రజల తరఫునకృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు.