జనం న్యూస్ ఆగస్టు 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
జగన్ రెడ్డికి 30 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యం జ్ఞాపకం వచ్చి ప్రజలు ఎన్నికల్లో స్వేచ్ఛగా పులివెందులలో ఓట్లు వేసుకుంటే జగన్ రెడ్డిలో భయం మొదలైందని, తన అహంకార సామ్రాజ్యం కుప్పు కూలిందని అక్కస్సుతో చంద్రబాబు నాయుడు పై అవాకులు చవాకులు పేలుతున్నాడని, నీ పతనం పులివెందుల జడ్పిటిసి ఎన్నికలలో విజయంతో మొదలైందని మాజీ శాసనమండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు జగన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి పదవిపోయి, ప్రతిపక్ష హోదా దక్కకపోవడం, వైసిపి క్యాడర్ నిర్వీర్మైపోవడం, మతిస్థిమితం లేకుండా పాలనా దక్షకుడు, అసాధ్యంసైతం సుశాధ్యాయం చేయగల చంద్రబాబు పై నోరు పారేసుకోవడం అతను దిగజారుడుతనానికి నిదర్శనమని నాగ జగదీష్ అన్నారు. పదవి పోవడంతో కేసులో ఒక్కొక్కటి బయటకు రావడం సిబిఐ ఈడి కేసులు ముంచుకొస్తున్నాయి, మరోపక్క మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం తన పాలకవర్గంలో మంత్రులుగా పని చేసిన వారిపై అవినీతి అక్రమాలు బయటికి రావడం, దానికి వారధి సారధి జగన్ రెడ్డి కావడంతో అనేక రాత్రులు నిద్రలేని కాలాన్ని గడుపుతున్న వ్యక్తికి ప్రజాస్వామ్యం జ్ఞాపకం రావడం, నాడు స్థానిక సంస్థలు ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసుకొని అవకాశం లేకుండా దౌర్జన్యాలు చేసి, పోలీసు యంత్రాంగాని చేతిలో పెట్టుకొని బెదిరించి, నామినేషన్లు చింపివేసి, అభ్యర్థులను కిడ్నాప్ చేసి, కార్పొరేషన్,మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు ఏకపక్షంగా చేసుకొని ప్రజలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ముఖ్యమంత్రి హోదాకే కళంకం తెచ్చిన నీవు, ప్రజాస్వామ్యం గురించి క్షుణ్ణంగా తెలిసిన నారా చంద్రబాబు గురించి మాట్లాడడం నీ అజ్ఞానానికి నిదర్శనం అని నాగ జగదీష్ అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పాలనయంత్రాంగంలో జరుగుతున్న విషయాలు గురించి, రాష్ట్రం గురించి, కేంద్రం దగ్గరికి వెళ్లినప్పుడు, జీవోలు రహస్యంగా ఉంచిన జగన్ రెడ్డి ఇప్పుడు రోజు విలేకరుల సమావేశం పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని, 30 వేల మంది నీవు సరఫరా చేసిన మద్యం తాగి వారి మరణానికి కారణమైన నీకు మరణ శాసనమే సరియైన శిక్ష, ఇప్పటికే ప్రజలు ప్రజాకోర్టులో నీకు శిక్ష వేశారని అయినప్పటికీ నీలో పరివర్తన రాలేదని నీవు గాల్లో కలిసిపోవడం ఖాయమని నాగ జగదీష్ అన్నారు.//