జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలం లోని శ్రీ అన్నమాచార్య అకాడమీ హై స్కూల్ నందు ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుండి చిన్న పిల్లలకు వారి తల్లిదండ్రులు శ్రీ కృష్ణుడు మరియు గోపిక వేశాధారణలో పాఠశాలకు తీసుకువచ్చారు. శనివారం శ్రీ కృష్ణాష్టమి పురస్కరించుకొని పాఠశాల కారస్పాండెంట్ సమ్మెట శివప్రసాద్, డైరెక్టర్ మాడపూరి హేమలత పర్యవేక్షణలో వేడుకలు నిర్వహించారు.ఈ సందర్బంగా పిల్లలకు పాటలు,నృత్యాలు మరియు ఉట్టి కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సమ్మెట ఉమా మహేష్ ప్రధానోపా ధ్యాయులు,అధ్యాపక బృందం, మరియు విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.