జనం న్యూస్, ఆగస్టు 14 ముమ్మిడివరం ప్రతినిధి
ప్రధాని మోడీ పిలుపు మేరకు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆదేశాల మేరకు, ఐ పోలవరం మండలం అధ్యక్షులు సఖి రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీ కొత్తపల్లి గ్రామంలో హర్ ఘర్ తిరంగ కార్యక్రమం నిర్వహించారు.జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా: బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి ట్రెజరర్ మండల ఇంచార్జ్ గ్రంధి నానాజీ పాల్గొన్నారు నియోజవర్గం మాజీ కన్వీనర్ గొల కోటి వెంకట్ రెడ్డి.ఈ సందర్భంగా ఎందరోమహానుభావుల త్యాగ ఫలితమే ఈ స్వాత్రంత్రమని ఈ పలితం ప్రతీ ఒక్కరికీ అందాలని ప్రధాని మోడీ అహర్నిశలు కృషి చేస్తూ ఆర్టికల్ 370ని రద్దు చేయడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ప్రతీ ఇంటిమీద జాతీయ జెండా ఎగురవేసే ఆవశ్యకత గురించి వివరించారు.అనంతరం .ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గంధం ఈశ్వరరావు జిల్లా కార్యవర్గ సభ్యులు రాయపు రెడ్డి భైరవమూర్తి మట్టా సూరిబాబు పేరా బత్తుల రామకృష్ణ ఉద్దిసపు సూరిబాబుగ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.