జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 14 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ దత్త సాయి అన్నదాన సమాజం జయ జయ సాయి ట్రస్ట్ మరియు భారతదేశపు అతిపెద్ద హైదరాబాద్ వాస్కులర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తనాళాలు వైద్య శిబిరం నిర్వహించబడుతుందని నిర్వాహకులు పూసపాటి బాలాజీ తెలియజేశారు ఉదయం 9 గంటల నుండి ఈ ఈ వైద్య శిబిరం ప్రారంభిస్తారని రక్తనాళాలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్న డయాలసిస్ రోగులకు పొట్టలో కాళ్లలో పిక్కలు ఉన్న రక్తనాళాల వాపు వాటికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్న ఆరోజు ఉచితంగా వైద్య పరీక్ష నిర్వహించి తగిన చికిత్స సూచిస్తారని తెలియజేశారు, శరీరంలోని ఏ భాగంలోని రక్తనాళానికైనా యాంజియో ప్లాస్టి స్టెంటింగ్ చేయబడును అని అని తెలియజేశారు కావున చిలకలూరిపేట పట్టణ నియోజకవర్గ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఉచితంగా వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించుకోవాల్సిందిగా కోరుతున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి హైదరాబాద్ వాస్కులర్ హాస్పిటల్ నుంచి ప్రముఖ వైద్యులు విచ్చేస్తున్నారు అని తెలియజేశారు, అనంతరం గురువారం సందర్భంగా భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు